Uhaku Minchina Song Lyrics

Uhaku Minchina Song Lyrics by ఊహకు మించిన క్రియలు చేయు దేవాఊపిరిని నింపుచు బ్రతికించిన నా యేసయ్య

Uhaku Minchina Song Lyrics

ఊహకు మించిన క్రియలు చేయు దేవా
ఊపిరిని నింపుచు బ్రతికించిన నా యేసయ్య -2
శూన్యమైన నా బ్రతుకును నూతన పరచుచున్నావు
రూపాంతరపరచె ఆత్మతో దర్శించు చున్నావు-2

అ:ప: నీ పాదములనే మ్రొకెద యేసయ్య
నీ నామమునునే కీర్తింతు యేసయ్య -2
(ఊహకు)

విశ్వాస యాత్రలో కాపరిగా తోడై నడిపించినావు
విసుగక తండ్రివలె నను మోయుచున్నావు-2
విజ్ఞాపనలన్ని ఆలకించి శ్రమలో నన్ను ఆదుకొన్నావు -2 (నీ పాద)

చీకటి లోయలో నీ వాక్య వెలుగుతో నను నీవు బలపరిచినావు
వ్యాధి బాధలలో నన్ను స్వస్థపరిచావు-2
సాతాను క్రియలన్నీ నా పాదముల క్రింద నీ నామ బలముతో అణచివేసావు-2 (నీ పాద)

రాజ్యము మహిమయు ఘనతయు నీవే రానున్న రాజాథి రాజా
త్వరలో రానున్న నీకొరకై నే కనిపెట్టుచున్నాను -2
వరుడైన నీతో జీవింప నేను నిరతము ఆశతో కాంక్షింతు దేవా -2 (నీ పాద)

video